Published : 10/10/2021 12:43 IST

Ebola Virus: ఆఫ్రికాలో మళ్లీ ఎబోలా కలవరం 

వాషింగ్టన్‌: ప్రాణాంతక ఎబోలా వైరస్‌ ఆఫ్రికా దేశాలను కలవరపెడుతోంది. 2020లో వందల మందిని పొట్టనపెట్టుకున్న ఈ మహమ్మారికి అడ్డుకట్ట పడిందని ప్రకటించిన 5 నెలల తర్వాత తూర్పు కాంగోలో కొత్త కేసు నమోదైంది. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. 

మూడేళ్ల చిన్నారిలో ఎబోలా లక్షణాలు కనిపించాయని అధికారులు తెలిపారు. దీంతో బెనిలోని బట్సిలి ఆసుపత్రికి తరలించగా.. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని, అక్టోబర్‌ 6న ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ‘‘కొవిడ్‌ సహా ఈ ప్రాంతంలో అంటువ్యాధుల విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. సమర్థ ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ నిరంతర నిఘా, సన్నద్ధత ఆవశ్యకతను ఇవి సూచిస్తున్నాయి.   

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని