Aryan khan: పేదల కోసం పనిచేస్తా.. చెడు మార్గంలో వెళ్లను: ఆర్యన్‌ఖాన్‌

 విడుదల అయిన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. తనకు చెడ్డపేరు తెచ్చే 

Published : 18 Oct 2021 01:30 IST

ఎన్‌సీబీ కౌన్సిలింగ్‌లో ఆర్యన్‌ ఖాన్‌  

ముంబయి: విడుదల అయిన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. తనకు చెడ్డపేరు తెచ్చే  పనులు చేయబోనని, చెడు మార్గంలో వెళ్లనని బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ శనివారం ఎన్‌సీబీ అధికారులకు హామీ ఇచ్చాడు. ఈనెల 2న ఓ క్రూయిజ్‌ నౌకలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న కేసులో ఆర్యన్‌ను ఎన్‌సీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ముంబయిలోని ఓ జైలులో అధికారులు అతనికి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యన్‌ వివిధ అంశాలపై మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. ‘‘పేదలు, అణగారిన వర్గాల ప్రజలకుచేయూతనిస్తా.. నన్ను చూసి గర్వపడేలా చేస్తా’’ అని అధికారులకు చెప్పాడు. కాగా అతని బెయిల్‌ వ్యాజ్యంపై ప్రత్యేక కోర్టు ఈనెల 20న ఆదేశాలు ఇవ్వనుంది. Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు