Covid Vaccine: 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌పై తుది నిర్ణయం అప్పుడే..

శాస్త్రీయ హేతుబద్ధత, టీకా సరఫరా పరిస్థితులకు అనుగుణంగానే దేశంలో 18 ఏళ్ల లోపువారికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం 

Published : 18 Oct 2021 12:40 IST

దిల్లీ: శాస్త్రీయ హేతుబద్ధత, టీకా సరఫరా పరిస్థితులకు అనుగుణంగానే దేశంలో 18 ఏళ్ల లోపువారికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధిపతి వీకే పాల్‌ ఆదివారం తెలిపారు. దేశంలో కొవిడ్‌ కేసులు, రెండో ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ మహమ్మారి ముప్పు తొలగిపోయిందని చెప్పలేమన్నారు. అనేక దేశాల్లో రెండు ఉద్ధృతులను మించిన పరిస్థితి కనిపిస్తోందన్నారు. ‘‘పలు దేశాల్లో 18 ఏళ్లలోపు వారికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన సంగతి తెలుసు. అయితే అనుమతి పొందిన పిల్లల టీకాల లభ్యత తదితర అంశాల మేరకు మన దేశంలో వారికి వ్యాక్సినేషన్‌పై తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని ‘పీటీఐ’ ముఖాముఖిలో పాల్‌ వెల్లడించారు.

దేశంలో ప్రస్తుతం పండగల సీజన్‌ నడుస్తుండటం.. ప్రజలు గుమిగూడటం వంటి పరిస్థితుల నేపథ్యంలో వైరస్‌ మరోసారి విజృంభించే అవకాశం ఉందని, అంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వ్యాక్సినేషన్‌ మెరుగ్గా సాగుతున్న దేశాల్లోనూ మహమ్మారి విజృంభిస్తుండటాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వ్యాక్సినేషన్‌లో వెనుకబడిన రాష్ట్రాలు వేగం పెంచాలని ఈ సందర్భంగా కోరారు. టీకాలు వేసేందుకు అవసరమైన సిరంజీలు దేశంలో తగినంతగా లేవని సాగుతున్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ.. అలాంటి సమస్య లేదన్నారు. అవసరం మేరకు సిరంజీల లభ్యత ఉన్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని