Petrol Prices: ఇంధన ధరల తగ్గింపునకు యత్నిస్తున్నాం

పెట్రోలు, డీజిలు ధరలను తగ్గించే విషయమై ఆర్థిక శాఖతో నిరంతరంగా

Published : 19 Oct 2021 14:01 IST

కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి

దిల్లీ: పెట్రోలు, డీజిలు ధరలను తగ్గించే విషయమై ఆర్థిక శాఖతో నిరంతరంగా చర్చలు జరుపుతున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఇంధన ధరలను అదుపు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాయి. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయమై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్‌ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని, ఇందుకోసం సౌదీ అరేబియా మొదలు రష్యా వరకు చమురు ఉత్పత్తి దేశాలతో పెట్రోలియం మంత్రిత్వశాఖ సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించాయి. దేశంలోని వ్యూహాత్మక ఇంధన నిల్వలు 90 రోజుల స్థాయి కన్నా స్వల్పంగా తగ్గాయని తెలిపాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని