
Donald Trump: ట్రంప్‌లో క్యాపిటల్ కలవరం
నాటి దాడి ఘటనపై దర్యాప్తును అడ్డుకునేందుకు యత్నాలు
విచారణ కమిటీకి రహస్య పత్రాలు అందకుండా కోర్టులో పిటిషన్
వాషింగ్టన్: అమెరికా చట్టసభ భవనం క్యాపిటల్‌పై జరిగిన దాడికి సంబంధించి కొనసాగుతున్న దర్యాప్తును అడ్డుకోవడానికి మాజీ అధ్యక్షుడు ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్న కమిటీకి వ్యతిరేకంగా ఆయన కోర్టు మెట్లెక్కారు. మరోవైపు తన సన్నిహితుడు, క్యాపిటల్‌పై దాడికి జరిగిన కుట్రలో కీలక పాత్రధారిగా భావిస్తున్న స్టీవ్ బానన్‌ను విచారణ విషయంలో కమిటీకి సహకరించకూడదని ట్రంప్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే బానన్ ఇప్పటివరకూ కమిటీ నోటీసులను ఖాతరు చేయలేదు. దీంతో ఆయనపై ధిక్కార చర్యలు తీసుకునేందుకు కమిటీ రంగం సిద్ధంచేసింది.
ఈ ఏడాది జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్‌పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు జరపడానికి బైడెన్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కమిటీని నియమించింది. క్యాపిటల్‌పై దాడి జరగడానికి ముందు, తర్వాత ఏం జరిగిందన్న విషయాలను తెలుసుకోవడంపై ఆ కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ సమయంలో అధ్యక్ష హోదాలో ఉన్న ట్రంప్ కార్యకలాపాలకు సంబంధించిన సుమారు 40 కీలక పత్రాలను తమకు అందించాలని వైట్‌హౌస్ నేషనల్ ఆర్కైవ్స్ సంస్థను కోరింది. దాడికి ముందు నిఘా వర్గాలకు అందిన సమాచారం, దాడి సమయంలో, అంతకు ముందు చేసిన భద్రత ఏర్పాట్లు, ఆరోజు ట్రంప్‌నకు అనుకూలంగా జరిగిన ర్యాలీలు, ట్రంప్ రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగాలు తదితర అంశాలకు సంబంధించిన పత్రాలు అందులో ఉన్నాయి. దీనిపై అభ్యంతరం తెలుపుతూ ట్రంప్ సోమవారం డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పత్రాలను రహస్యంగా ఉంచే కార్యనిర్వాహక అధికారం నాటి అధ్యక్షుడిగా తనకు ఉందని అందులో పేర్కొన్నారు. వాటిని అందించాలని కమిటీ చేసిన అభ్యర్థనకు చట్టపరమైన అర్హత లేదని వాదించారు. పత్రాలను అందించకుండా నేషనల్ అర్కైవ్స్ సంస్థను ఆదేశించాలని కోరారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.