Imran khan: వివాదంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై పలువురు ప్రతిపక్ష నేతలు బుధవారం

Updated : 21 Oct 2021 09:37 IST

లాహోర్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై పలువురు ప్రతిపక్ష నేతలు బుధవారం తీవ్ర ఆరోపణలు చేశారు. ఇతర దేశాధినేతలు అందజేసిన బహుమతులను ఆయన అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ఓ గల్ఫ్‌ దేశ యువరాజు ఇచ్చిన ఖరీదైన గడియారాన్ని విక్రయించి సుమారు రూ.7.4 కోట్లు జేబులో వేసుకున్నారని ఆరోపించారు. ఆయన తీరు సిగ్గుచేటని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) పార్టీ ఉపాధ్యక్షురాలు మర్యమ్‌ నవాజ్, విపక్ష కూటమి- పాకిస్థాన్‌ డెమోక్రటిక్‌ మూవ్‌మెంట్‌ (పీడీఎం) అధ్యక్షుడు మౌలానా ఫజ్లుర్‌ రెహ్మాన్‌ తదితరులు ఇమ్రాన్‌పై ఈ ఆరోపణలు గుప్పించినవారిలో ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని