Kids On Bike: బైక్‌పై చిన్నారులను తీసుకెళ్తున్నారా?
ద్విచక్ర వాహనంలో వెనుక సీట్లో నాలుగేళ్లలోపు పిల్లల్ని కూర్చొబెట్టుకొని తీసుకెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర రహదారి, రవాణాశాఖ సూచించింది.
అయితే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి..
కొత్త నిబంధనలతో కేంద్రం ముసాయిదా విడుదల
ఈనాడు, దిల్లీ: ద్విచక్ర వాహనంలో వెనుక సీట్లో నాలుగేళ్లలోపు పిల్లల్ని కూర్చొబెట్టుకొని తీసుకెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర రహదారి, రవాణాశాఖ సూచించింది. దీనికోసం కొత్త నిబంధనలు రూపొందించి వాటి ముసాయిదాను సోమవారం విడుదల చేసింది. వీటిపై సలహాలు, సూచనలను ఆహ్వానించింది. నిబంధనలు ఖరారైన తర్వాత ఏడాది నుంచి ఇవి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం 4 ఏళ్లలోపు చిన్నారులను తీసుకెళ్లేటప్పుడు లైఫ్‌జాకెట్ లాంటి కొత్త తరహా జాకెట్ ధరించాలని పేర్కొంది. ఈ జాకెట్‌కు ఉన్న స్ట్రాప్స్‌ని డ్రైవర్ నడుము చుట్టూ బెల్టు మాదిరిగా బిగించాలని తెలిపింది. ఈ జాకెట్ తక్కువ బరువుతో, సర్దుబాటుచేసుకొనే విధంగా, వాటర్‌ప్రూఫ్‌గా ఉండాలని పేర్కొంది. స్ట్రాప్స్ గట్టి నైలాన్ మెటీరియల్‌తో, 30 కేజీల బరువును పట్టి ఉంచేంత బలంగా డిజైన్ చేయాలని తెలిపింది. చిన్నారులకు హెల్మెట్‌ను తప్పనిసరిగా పెట్టాలని పేర్కొంది. 4 ఏళ్లలోపు పిల్లలతో వెళ్తున్న ద్విచక్రవాహన వేగం 40 కిలోమీటర్లకు మించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఈమేరకు కేంద్ర మోటారు వాహన నిబంధనలు 1989లో సవరణలు చేయనున్నట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్‌లో షేర్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా