Assange: ‘అసాంజే ఆత్మహత్య చేసుకునే ముప్పుంది’

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికిలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌

Published : 29 Oct 2021 10:58 IST

లండన్‌: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికిలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేను అగ్రరాజ్యానికి అప్పగించే విషయమై బ్రిటన్‌ హైకోర్టులో గురువారం వాడీవేడీ వాదనలు జరిగాయి. ఆయన్ను అమెరికాకు అప్పగించవద్దని, అక్కడి పరిస్థితులు తాళలేక ఆయన ఆత్మహత్య చేసుకునే ముప్పు తీవ్రంగా ఉందని అసాంజే తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే.. సుమారు పదేళ్ల కిందట అమెరికా సైన్యానికి చెందిన రహస్య పత్రాలను బహిర్గతం చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో ఆయన గూఢచర్యానికి పాల్పడ్డారంటూ అగ్రరాజ్యంలో కేసు నమోదైంది. ఇందులో నమోదైన ఆరోపణలు రుజువైతే, అసాంజేకు 175 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది! ఈ క్రమంలో, అసాంజేను తమకు అప్పగించాలని అమెరికా కోరుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని