Global Warming: ఈ ఏడేళ్లు.. అత్యంత వేడి సంవత్సరాలు!

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయని తాజా నివేదిక ఒకటి తెలిపింది.

Updated : 01 Nov 2021 13:54 IST

గ్లాస్గో: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయని తాజా నివేదిక ఒకటి తెలిపింది. 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2021.. అత్యంత వేడి సంవత్సరాలుగా రికార్డుల్లోకి ఎక్కే అవకాశముందని వెల్లడించింది. కాప్‌-26 సదస్సు నేపథ్యంలో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) తాజా నివేదికను విడుదల చేసింది. 2021కి సంబంధించి తొలి 9 నెలల వివరాలను అందులో పొందుపర్చింది. ఆ డేటాను బట్టి చూస్తే.. ఏడాది ముగిసేసరికి 2021 అత్యంత వేడి సంవత్సరాల జాబితాలో 5-7 స్థానాల మధ్య ఉండే అవకాశముందని పేర్కొంది. లా నినా ప్రభావంతో ఈ ఏడాది ఆరంభంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైనా అలాంటి పరిస్థితులు ఉండటం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. పారిశ్రామిక యుగం ముందునాటితో పోలిస్తే 2021లో సగటు ఉష్ణోగ్రత 1.09 డిగ్రీల సెల్సియస్‌ మేర అధికంగా ఉందని తెలిపింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2100 కల్లా సముద్ర మట్టాల స్థాయి 2 మీటర్ల మేర పెరిగే అవకాశముందని వెల్లడించింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల మంది నిరాశ్రయులయ్యే ముప్పుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని