
Kidnap: ప్రియురాలి ఖర్చుల కోసం కిడ్నాప్ డ్రామా..
మధ్యప్రదేశ్‌లోని భీండ్ జిల్లా గోహద్ ప్రాంతానికి చెందిన సందీప్.. తన ప్రియురాలి ఖర్చులు భరించేందుకు కొంత డబ్బు అవసరమని భావించాడు. ఇందుకోసం తాను కిడ్నాప్‌కు గురైనట్లు నాటకం ఆడాడు. కిడ్నాపర్లా గొంతమార్చి మాట్లాడుతూ తల్లిదండ్రులను నమ్మించాడు. కుమారుడిని విడిచిపెట్టాలంటే రూ.2.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఈనెల 6న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. సందీపే కిడ్నాపర్ అని వెల్లడైంది. అతని మొబైల్ నెట్వర్క్ లొకేషన్ ఆధారంగా పోలీసులు గ్వాలియర్‌లో సందీప్ ఆచూకీని గుర్తించి అరెస్టు చేశారు. కిడ్నాప్ డ్రామాపై యువకుడిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.