
Gold: శానిటరీ ప్యాడ్స్‌లో 2.4 కేజీల బంగారం
ఎయిర్ ఇండియా విమానంలో పని చేస్తున్న ఓ మహిళ.. శానిటరీ ప్యాడ్స్‌లో బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు యత్నించారు. చివరకు కస్టమ్స్ అధికారులకు దొరికిపోయారు. ఆమె నుంచి 2.4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేరళ కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఈ విమానం షార్జా నుంచి వచ్చిందని అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన మహిళను మలప్పురం ప్రాంతానికి చెందిన షహానాగా గుర్తించారు. షహానా.. తన శానిటరీ ప్యాడ్స్‌లో బంగారాన్ని అక్రమ రవాణా చేసిందని.. వాటిని తన లోదుస్తుల్లో దాచిందని అధికారులు చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.