Julian Assange: జైలులోనే అసాంజే పెళ్లికి అనుమతి

బెయిల్‌ నిబంధనల ఉల్లంఘన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేకు భాగస్వామి స్టెల్లా

Published : 13 Nov 2021 12:30 IST

లండన్‌: బెయిల్‌ నిబంధనల ఉల్లంఘన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేకు భాగస్వామి స్టెల్లా మోరిస్‌ను కారాగారంలోనే వివాహం చేసుకునేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం అనుమతించింది. వివాహ తేదీపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న సమయంలో అసాంజే తన న్యాయవాదులలో ఒకరైన స్టెల్లా మోరిస్‌తో ప్రేమలో పడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది ఏప్రిల్‌లో అసాంజే-మోరిస్‌ జంట తమ బంధాన్ని బయటపెట్టింది. ఈ ఏడాది జనవరిలో.. జైలులో వివాహం చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే వికీలీక్స్‌లో అమెరికా రహస్య సమాచారాన్ని బయటపెట్టారు. ఆ దేశం నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో లండన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో కొంతకాలం ఆశ్రయం పొందారు. ఈక్వెడార్‌ ఆశ్రయాన్ని విరమించుకున్న తర్వాత బ్రిటన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2019 నుంచి లండన్‌లోని జైలులో ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని