Vir Das: దేశం పరువు తీస్తారా.. కమెడియన్‌ వీర్‌దాస్‌ వీడియోపై వివాదం

స్టాండప్‌ కమెడియన్‌ వీర్‌దాస్‌ ‘ఐ కమ్‌ ఫ్రమ్‌ టు ఇండియాస్‌’ వీడియో వివాదస్పదమవుతోంది. వాషింగ్టన్‌లో

Updated : 18 Nov 2021 13:31 IST

దిల్లీ: స్టాండప్‌ కమెడియన్‌ వీర్‌దాస్‌ ‘ఐ కమ్‌ ఫ్రమ్‌ టు ఇండియాస్‌’ వీడియో వివాదస్పదమవుతోంది. వాషింగ్టన్‌లో తాను ఇచ్చిన ప్రదర్శనను వీర్‌దాస్‌ ‘యూట్యూబ్‌’లో అప్‌లోడ్‌ చేశారు. ఇందులో ఆయన తాను రెండు భారత్‌ల నుంచి వచ్చానని, ఒక భారత్‌ మహిళలను పగలు పూజిస్తుందని, మరో భారత్‌లో అదే మహిళలపై రాత్రి అత్యాచారం చేస్తున్నారని పేర్కొన్నారు. పెట్రోల్‌ ధరలు, లఖీంపుర్‌ హింస, కొవిడ్‌.. తదితర అంశాలను కూడా వీర్‌దాస్‌ ప్రస్తావించారు. దీనిపై భాజపా నేతలు మండిపడ్డారు.

 దేశాన్ని వీర్‌దాస్‌ కించపరిచారని దిల్లీ భాజపా అధికార ప్రతినిధి ఆదిత్య ఝా, ముంబయి న్యాయవాది అశుతోష్‌ దుబే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ మిశ్రమ స్పందన వ్యక్తం చేసింది. కపిల్‌ సిబల్, శశిథరూర్‌.. వీర్‌దాస్‌ను సమర్థించగా, మరో సీనియర్‌ నాయకుడు అభిషేక్‌ మనుసింఘ్వీ తప్పుపట్టారు. ‘‘రెండు భారత్‌లు ఉన్నాయి. కానీ ఆ విషయాన్ని ఓ భారతీయుడు ప్రపంచానికి చెప్పడం మనకు ఇష్టం ఉండదు’’ అంటూ సిబల్‌ ట్వీట్‌ చేశారు. లక్షల మంది భారతీయుల మనోభావాలను తన వీడియోలో వీర్‌దాస్‌ ప్రతిఫలించారని శశిథరూర్‌ తెలిపారు. ప్రపంచం ముందు దేశాన్ని దుమ్మెత్తిపోయడం సరికాదని అభిషేక్‌ మనుసింఘ్వీ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని