Drugs: ఆన్‌లైన్‌లో గంజాయి అమ్మకాలు..  ‘అమెజాన్‌ ఇండియా’పై కేసు నమోదు

స్వీట్‌నర్‌ పేరిట ఆన్‌లైన్‌లో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్‌ రాకెట్‌ను ఛేదించిన మధ్యప్రదేశ్‌ పోలీసులు..

Published : 21 Nov 2021 14:35 IST

భోపాల్‌: స్వీట్‌నర్‌ పేరిట ఆన్‌లైన్‌లో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్‌ రాకెట్‌ను ఛేదించిన మధ్యప్రదేశ్‌ పోలీసులు.. ఈ అమ్మకాలకు వీలు కల్పించిన ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ‘అమెజాన్‌ ఇండియా’పై శనివారం కేసు నమోదు చేశారు. ఏఎస్‌ఎస్‌ఎల్‌ పేరిట ఈ-కామర్స్‌ వ్యాపారం చేస్తున్న అమెజాన్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్స్‌పై నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ చట్టంలోని సెక్షన్‌ 38 కింద కేసు పెట్టినట్టు భింద్‌ జిల్లా ఎస్పీ మనోజ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఈనెల 13న ఇద్దరు గ్వాలియర్‌ వాసుల నుంచి 21.7 కిలోల గంజాయిని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి వీరు సరకును అమెజాన్‌ ద్వారా తెప్పించి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. కాగా నిషేధిత వస్తువుల అమ్మకాలకు అమెజాన్‌ను వేదికగా మారనీయబోమని ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని కూడా పేర్కొంది 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని