
Booster dose: బూస్టర్ డోసు అందించడంపై మీ వైఖరేంటి?
కేంద్రాన్ని ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు
దిల్లీ: కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసు అందించే విషయమై తన వైఖరిని తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ దేశాలు తమ ప్రజలకు బూస్టర్ డోసు అందించాలని యోచిస్తుండగా, భారత నిపుణులు మాత్రం బూస్టర్ డోసు అవసరమన్న వైద్య నిరూపణ ఏమీ లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్లకు సంబంధించిన కేసులో జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ జస్మీత్ సింగ్ల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. రెండో ఉద్ధృతి వంటి పరిస్థితి మళ్లీ రాకూడదని కోరుకుంటున్నామని, బూస్టర్ డోసు అందించే విషయమై కేంద్రం తన వైఖరిని తెలియజేయాలని కోరింది. ఇదే అంశం భారత ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానం ముందు పెండింగులో ఉందని కేంద్రం తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.