Stray Dogs: వీధి కుక్కలు 6.2 కోట్లు.. పిల్లులు 91 లక్షలు!

ఇంటి నుంచి బయటకు వస్తే.. రోడ్డు మీద ఎన్నో వీధి కుక్కలు, పిల్లులు కనిపిస్తుంటాయి. ఇది సర్వసాధారణమైన విషయం.

Published : 27 Nov 2021 12:13 IST

 ఇదీ దేశంలో లెక్క
‘పెట్‌ హోమ్‌లెస్‌నెస్‌ ఇండెక్స్‌’ నివేదికలో వెల్లడి

దిల్లీ: ఇంటి నుంచి బయటకు వస్తే.. రోడ్డు మీద ఎన్నో వీధి కుక్కలు, పిల్లులు కనిపిస్తుంటాయి. ఇది సర్వసాధారణమైన విషయం. అసలు దేశంలో మొత్తం వీధి కుక్కలు, పిల్లులు ఉంటాయో అంచనా వేశారా? ఆ పనే చేసి వివరాలు వెల్లడించింది ‘ది స్టేట్‌ ఆఫ్‌ పెట్‌ హోమ్‌లెస్‌నెస్‌ ఇండెక్స్‌’. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 6.2 కోట్ల వీధి శునకాలు, 91 లక్షల వీధి పిల్లులు ఉన్నాయి. దాదాపు 68 శాతం జనాభాకు (ప్రతి 10 మందిలో ఏడుగురు) వీధి పిల్లులు వారానికోసారి కనిపిస్తున్నాయి. ఇక కుక్కల్ని తరచూ చూస్తున్నట్టు 77 శాతం జనాభా (ప్రతి 10 మందిలో ఎనిమిది) పేర్కొంది. వీధి కుక్కలు, పిల్లుల సంఖ్య పెరుగుతోంది అంటే.. ‘ఆల్‌ పెట్స్‌ వాంటెడ్‌ (జంతువుల పెంపకం)’ డేటాలో భారత్‌ స్కోరు పడిపోతోందని అర్థం.

నివేదికలోని మరిన్ని వివరాలు

దేశవ్యాప్తంగా దాదాపు 8 కోట్ల కుక్కలు, పిల్లులకు నివాసాలు లేవు. షెల్టర్‌ హోమ్స్‌లో 88 లక్షల శునకాలు, పిల్లులు ఉన్నాయి. వికలాంగులకు సహాయం చేయడంలో ఎలాంటి శిక్షణ లేని జంతువులు (కంపానియన్‌ యానిమల్స్‌) 85 శాతం ఉన్నాయి. దూరం ఎక్కువగా ఉందని, పరువు పోతుందని, మౌలిక వసతులు లేవని.. పెట్స్‌ను పెంచుకునే వారిలో 61 శాతం మంది పశువైద్యశాలను సందర్శించడం లేదు. అంతర్జాతీయ సగటు (31) కన్నా ఇది చాలా ఎక్కువ. దీంతో ఆల్‌ పెట్స్‌ కేర్డ్‌ ఫర్‌(జంతువుల సంరక్షణ) స్కోరు పడిపోయింది. అయితే భవిష్యత్తులో జంతువులను పెంచుకోవడానికి సముఖంగా ఉన్న ప్రజల సంఖ్య పెరుగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని