95 దేశాలకు 7 కోట్ల టీకా డోసుల సరఫరా 

ప్రపంచవ్యాప్తంగా 95 దేశాలకు ఈనెల 22 వరకు 7.07 కోట్ల కొవిడ్‌ టీకా డోసులను భారత్‌ అందజేసినట్లు కేంద్ర 

Published : 27 Nov 2021 12:47 IST

బ్రిక్స్‌ సమావేశంలో కేంద్రమంత్రి వెల్లడి

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 95 దేశాలకు ఈనెల 22 వరకు 7.07 కోట్ల కొవిడ్‌ టీకా డోసులను భారత్‌ అందజేసినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ శుక్రవారం తెలిపారు. 9వ బ్రిక్స్‌ దేశాల సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. ప్రపంచ నవకల్పనల సూచిలో బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా) దేశాలు తగిన స్థానం సంపాదించేంద]ుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. శాస్త్ర, సాంకేతిక రంగాలు, నవకల్పనల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారానే ఇది సాధ్యమని అన్నారు. ‘వ్యాక్సిన్‌ మైత్రి’ కార్యక్రమంలో భాగంగా భారత్‌ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు టీకాలను అందజేస్తున్నట్లు చెప్పారు. సమావేశానికి ఆయా దేశాల మంత్రులు హాజరయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని