China: ఆ విధానం వదిలేస్తే.. చైనాలో భారీగా కొవిడ్‌ కేసులు

మహమ్మారిని కట్టడి చేసేందుకు చైనా అవలంబిస్తున్న ‘జీరో కొవిడ్‌ టోలరెన్స్‌’ విధానాన్ని వదిలేస్తే

Published : 29 Nov 2021 13:14 IST

తాజా అధ్యయనం వెల్లడి

బీజింగ్‌: మహమ్మారిని కట్టడి చేసేందుకు చైనా అవలంబిస్తున్న ‘జీరో కొవిడ్‌ టోలరెన్స్‌’ విధానాన్ని వదిలేస్తే.. ఒక్కసారిగా అతి భారీ స్థాయిలో కేసులు విజృంభిస్తాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ విధానాన్ని ఎత్తివేయడంతో పాటు, పలు దేశాల మాదిరిగా ప్రయాణాలపై నిషేధాన్ని కూడా తొలగిస్తే చైనాలో రోజుకు 6.30 లక్షల వరకు కొవిడ్‌ కేసులు బయటపడే ప్రమాదం ఉందని ఇక్కడి పెకింగ్‌ యూనివర్సిటీకి చెందిన గణితశాస్త్ర నిపుణులు ఓ నివేదికలో పేర్కొన్నారు.

2019 ఆఖరులో కరోనా తొలి కేసు చైనాలోని వూహాన్‌లోనే బయటపడిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిగా మారినప్పటి నుంచి చైనా ‘ఒక్క కేసు కూడా రాకూడదన్న’ లక్ష్యంతో కట్టుదిట్టమైన విధానాన్ని అవలంబించింది. చైనాకు ఈ ‘జీరో కొవిడ్‌’ విధానం తప్ప మరో మార్గం లేదని స్థానిక మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో చైనా దీన్ని వదిలేసి, అమెరికా ప్రస్తుతం అవలంబిస్తున్న విధానాన్ని పాటిస్తే రోజుకు 6,37,155 కేసులు బయపడతాయని తాజా అధ్యయనం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని