
Pizza: పిజ్జా పిండిలో రేజర్ బ్లేడ్లు
అమెరికాలో ఓ వ్యక్తికి జైలు శిక్ష
పోర్ట్‌ల్యాండ్: పిజ్జా తయారుచేసేందుకు సిద్ధం చేసిన తడి పిండిలో రేజర్ బ్లేడ్లు, నట్లు ఉంచిన వ్యక్తికి న్యాయస్థానం గురువారం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. నికోలస్ మిషెల్(39) అనే వ్యక్తి మెయినీ, న్యూ హ్యాంప్షైర్లలోని సూపర్మార్కెట్లలో పిజ్జా పిండిలో రేజర్ బ్లేడ్లు, నట్లు ఉంచాడు. ఇందుకు సంబంధించి 2020లో అరెస్టయ్యాడు. ఈ మేరకు తనపై మోపిన రెండు కౌంట్లలో ఒక దాన్ని జూన్ నెలలో అంగీకరించాడు. ఈ క్రమంలో న్యాయమూర్తి తాజాగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. అదే సమయంలో నికోలస్.. హన్నాఫోర్డ్ సూపర్మార్కెట్లకు 2.30 లక్షల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.