మలద్వారంలో ఇరుక్కున్న తూటా.. తొలగించిన వైద్యులు

ఓ వ్యక్తి హడావుడిగా ఆస్పత్రికి చేరుకున్నాడు.. తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటే ఏమైందని అడగ్గా అతను చెప్పిన సమాధానం

Published : 04 Dec 2021 14:10 IST

ఓ వ్యక్తి హడావుడిగా ఆస్పత్రికి చేరుకున్నాడు.. తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటే ఏమైందని అడగ్గా అతను చెప్పిన సమాధానం విని వైద్యులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. తన మలద్వారంలో ఓ శతఘ్ని తూటా ఇరుక్కుపోయినట్లు అతను విలవిలలాడుతూ చెప్పాడు. బ్రిటన్‌లోని గ్లూసెస్టర్‌లోని ఓ ఆసుపత్రి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తాను ఓ ప్రైవేటు ఆయుధశాలను శుభ్రపరుస్తుండగా తుళ్లి.. శతఘ్ని తూటాపై పడటంతో అది చొచ్చుకు పోయినట్లు బాధితుడు చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన వైద్యులు అతన్ని అత్యవసర విభాగానికి తరలించారు. దాదాపు 2 అంగుళాల పరిమాణం ఉన్న ఆ తూటాను తీయడం వైద్యులకు కష్టతరంగా మారింది. దీంతో ప్రత్యేక నిపుణుడి సాయంతో బయటకు తీసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం రక్షణ శాఖకు సమాచారాన్ని చేరవేశారు. ముందు జాగ్రత్తగా బాంబ్‌ స్క్వాడ్‌ను కూడా రప్పించారు. ఈ శతఘ్ని తూటా రెండో ప్రపంచ యుద్ధం నాటిదని.. పాత జ్ఞాపకాలను పదిలంగా భద్రపరుచుకునేందుకే ఓ వ్యక్తి ప్రైవేటు ఆయుధశాలను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు