అక్కడ ఏడాదంటే 8 గంటలే

కొత్త ఎక్సో ప్లానెట్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని పేరు జీజే367బి.

Updated : 04 Dec 2021 12:23 IST

కొత్త ఎక్సోప్లానెట్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు

కీల్‌(యూకే): కొత్త ఎక్సో ప్లానెట్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని పేరు జీజే367బి. ఇది ఇప్పటివరకు కనిపెట్టిన 5000 ఎక్సో ప్లానెట్లలో తేలికైంది. సౌర కుటుంబాలు ఆవల ఉండే గ్రహాలను ఎక్సో ప్లానెట్స్‌ అని పిలుస్తారు. ఇవి నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తాయి. సాధారణంగా సూర్యుడి చుట్టూ తిరగడానికి భూమికి 365 రోజులు పడుతుంది. కొత్తగా కనిపెట్టిన ఈ గ్రహం మాత్రం తన మాతృ నక్షత్రం చుట్టూ 8 గంటల్లోనే పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుంది. ఈ లెక్కన అక్కడ సంవత్సరమంటే.. మనకు 8 గంటలేనన్న మాట! అంగారకుడి కంటే ఇది కాస్త పెద్దది. ఉష్ణోగ్రత 1500 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటుంది. ఈ వాతావరణంలో కఠినమైన లోహాలు కూడా ఇట్టే కరిగిపోతాయి. భూమి నుంచి 31 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఈ గ్రహాన్ని క్రిస్టిన్‌ లామ్‌ నేతృత్వంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లానెటరీ రీసెర్చ్‌ సెంటర్‌కు చెందిన 72 మంది శాస్త్రవేత్తల బృందం కనుగొంది. వీరి పరిశోధన పత్రాన్ని ‘జర్నల్‌ సైన్స్‌’ ప్రచురించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని