China: ఇక చైనా నుంచి లావోస్‌కు నేరుగా రైలు

చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌(బీఆర్‌ఐ) ప్రాజెక్టులో

Updated : 04 Dec 2021 14:13 IST

బీజింగ్‌: చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌(బీఆర్‌ఐ) ప్రాజెక్టులో ఒక కీలక ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లోని కున్‌మింగ్‌ నుంచి లావోస్‌ రాజధాని వియంటియాన్‌కు రైలు మార్గం ప్రారంభమైంది. బీఆర్‌ఐలో ఇది తొలి సీమాంతర ప్రాజెక్టు కావడం గమనార్హం. ప్రారంభోత్సవ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌.. లావోస్‌ ప్రధాని థాంగ్లూన్‌ సిసోలిత్‌ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు విలువ 600 కోట్ల డాలర్లు. 2016లో నిర్మాణం ప్రారంభమైంది. 1035 కిలోమీటర్ల ఈ రైలు మార్గం కున్‌మింగ్‌ను, వియంటియాన్‌ను కలుపుతుంది. సాధారణంగా లావోస్‌ రాజధాని నుంచి చైనా సరిహద్దుకు చేరడానికి రెండు రోజులు పడుతుంది. ఈ రైలుతో ఆ సమయం మూడు గంటలకు పరిమితం కానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని