ద్విచక్ర వాహన నంబరులో ‘సెక్స్‌’ సిరీస్‌ తొలగించండి

దేశరాజధానిలో ద్విచక్రవాహనాల రిజిస్ట్రేషన్‌ నంబరులో ‘సెక్స్‌’ (ఎస్‌ఈఎక్స్‌) సిరీస్‌ను 

Published : 05 Dec 2021 12:22 IST

రవాణాశాఖకు దిల్లీ మహిళా కమిషన్‌ ఆదేశం

దిల్లీ: దేశరాజధానిలో ద్విచక్రవాహనాల రిజిస్ట్రేషన్‌ నంబరులో ‘సెక్స్‌’ (ఎస్‌ఈఎక్స్‌) సిరీస్‌ను తొలగించాలని రవాణా శాఖను దిల్లీ మహిళా కమిషన్‌ ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది.  ఇటీవల స్కూటర్‌ కొనుగోలు చేసిన ఓ యువతి తన వాహన రిజిస్ట్రేషన్‌ నంబరులో ‘సెక్స్‌’ అనే అక్షరాలు ఉన్న సిరీస్‌ను పొందారు.

ఈ కారణంగా.. వాహనంపై బయటకు వెళ్లినప్పుడు పలు అవమానాలను ఎదుర్కొంటున్నానని, అంతేకాకుండా పలువురు ఆట పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సదరు యువతి.. మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. నిత్యావసర సరకులు కొనడానికీ బయటకు వెళ్లలేకపోతున్నానని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కమిషన్‌.. వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్‌ సిరీస్‌ను వెంటనే మార్చాలని ఆదేశిస్తూ రవాణా శాఖకు నోటీసులు జారీ చేసింది. ఈ తరహా ఫిర్యాదులతో పాటు ఆ సిరీస్‌పై రిజిస్టర్‌ అయిన వాహనాల సంఖ్యనూ తమకు సమర్పించాలని పేర్కొంది. ఈ వ్యవహారంపై నాలుగు రోజుల్లో నివేదిక అందించాలని రవాణా శాఖకు సూచించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని