Updated : 06/12/2021 12:52 IST

CBSE: గుజరాత్‌ అల్లర్లపై.. సీబీఎస్‌ఈ ప్రశ్నపత్రం దుమారం!

అహ్మదాబాద్‌: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు 2002 గుజరాత్‌ అల్లర్లపై అడిగిన ప్రశ్నపత్రం దుమారం రేపింది. తప్పు తెలుసుకున్న బోర్డు ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ఇటీవల 12వ సోషియాలజీ పేపర్‌లో 2002 అల్లర్ల సమయంలో గుజరాత్‌ రాష్ట్రాన్ని ఏ పార్టీ పాలిస్తోందని అడిగారు.

అంతేకాకుండా విద్యార్థులు సమాధానం ఎంచుకునేందుకు భాజపా, కాంగ్రెస్, డెమోక్రాట్లు, రిపబ్లికన్లు అని 4 ఆప్షన్లు కూడా ఇచ్చారు. ఇలాంటి సున్నితమైన అంశంపై ప్రశ్నపత్రం రూపొందించడంపై విమర్శలు రావడంతో సీబీఎస్‌ఈ బోర్డు స్పందించింది. ఇది నిపుణుల మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు.. 2002 గుజరాత్‌ అల్లర్లు, 1984 సిక్కుల అల్లర్ల అంశాలను ఇప్పటికే పాఠ్యపుస్తకాల్లో ప్రస్తావించారంటూ ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని