Corona Vaccine: నర్సు పొరపాటు.. ఇద్దరు శిశువులకు కొవిడ్‌ టీకా

రెండు నెలల ఆడ శిశువు, నాలుగు నెలల మగ శిశువుకు ఓ నర్సు పొరపాటున కొవిడ్‌ టీకా వేసింది.

Published : 07 Dec 2021 11:01 IST

సాల్వెడార్‌: రెండు నెలల ఆడ శిశువు, నాలుగు నెలల మగ శిశువుకు ఓ నర్సు పొరపాటున కొవిడ్‌ టీకా వేసింది. దాంతో ఆ చిన్నారులిద్దరూ తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రిలో చేర్చారు. బ్రెజిల్‌లో ఈ ఘటన జరిగింది. హెపటైటిస్‌-బి వంటి వ్యాధులను ఎదుర్కొనేందుకుగాను రోగ నిరోధక శక్తి కోసం అందించే టీకాకు బదులుగా శిశువులకు ఆ నర్సు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసింది. దీంతో వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడింది. వారిద్దరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ నర్సును ఉద్యోగం నుంచి తాత్కాలికంగా తొలగించినట్లు అధికారులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని