త్రివిధ దళాల్లో పనిచేసిన ఏకైన యోధుడు ప్రీతిపాల్‌సింగ్‌ కన్నుమూత

గగనతలంలో శత్రువులను యుద్ధ విమానాలతో ఎదుర్కొన్నారాయన. సముద్రాలను ఆక్రమించేందుకు వచ్చినవారిపై యుద్ధనౌకలతో పోరాడారు. 

Published : 07 Dec 2021 11:18 IST

101 పుట్టినరోజుకు సిద్ధమవుతున్న తరుణంలో విషాదం

గగనతలంలో శత్రువులను యుద్ధ విమానాలతో ఎదుర్కొన్నారాయన. సముద్రాలను ఆక్రమించేందుకు వచ్చినవారిపై యుద్ధనౌకలతో పోరాడారు. సరిహద్దులు దాటేందుకు కుట్రలు పన్నిన ప్రత్యర్థులను తుపాకీలతో మట్టికరిపించారు. ఆయనే.. మాజీ కర్నల్‌ ప్రీతిపాల్‌సింగ్‌ గిల్‌. భారత వైమానిక దళం, నౌకా దళం, సైన్యం(ఆర్మీ).. ఇలా మూడు విభాగాల్లో దేశానికి సేవలందించిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందిన ప్రీతిపాల్‌సింగ్‌ గిల్‌ ఇక లేరు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. హరియణా రాజధాని చండీగఢ్‌లోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ప్రీతిపాల్‌ సింగ్‌ ఈ నెల 11న 101వ పుట్టినరోజును జరపుకోవాల్సి ఉంది. ఈ తరుణంలోనే విషాదం చోటుచేసుకుంది. ప్రీతిపాల్‌ సింగ్‌ తొలుత రాయల్‌ ఇండియన్‌ వైమానిక దళంలో పైలట్‌గా సేవలందించారు. ఆ తర్వాత నౌకా దళంలో చేరి.. భారీస్థాయి సముద్ర ప్రయాణాలు చేశారు. అనంతరం.. 1965లో భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధ సమయంలో సైన్యంలో అడుగుపెట్టారు. అక్కడ గన్నర్‌ అధికారిగా విధులు నిర్వర్తించారు. అసోం రైఫిల్స్‌ విభాగాధిపతిగానూ మణిపుర్‌లో పనిచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని