Updated : 09/12/2021 09:38 IST

Helicopter crash: కాలిపోతున్నా పరిగెత్తారు!

కున్నూర్‌: తమిళనాడులోని కున్నూర్‌ సమీపంలో హెలికాప్టర్‌ కూలిపోయినచోట బీతావహ వాతావరణం కనిపించింది. మృతుల శరీర భాగాలు, లోహవిహంగ శకలాలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బాధితుల దుస్థితిని చూసి పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఓ తేయాకు తోటకు చాలా దగ్గరగా ఈ దుర్ఘటన జరిగింది. తోటలో పనిచేస్తున్న కూలీలు, చుట్టుపక్కలవారు తొలుత ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రమాదం తీరు, తర్వాతి పరిణామాలను కొందరు ప్రత్యక్ష సాక్షులు వివరిస్తూ.. ‘‘ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్లు అనిపించింది. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న ఓ హెలికాప్టర్‌ చెట్లను ఢీకొడుతూ కూలిపోవడం చూశాం. ఆ వెంటనే పేలుడు సంభవించింది. హెలికాప్టర్‌ శిథిలాల నుంచి లేచిన ఓ వ్యక్తికి మంటలు అంటుకొని ఉన్నాయి. అయినప్పటికీ ప్రాణాలు కాపాడుకునేందుకు కొంతదూరం పరిగెత్తి ఆయన కుప్పకూలిపోయారు. మరో ముగ్గురు వ్యక్తులూ కాలిపోతూనే పరిగెత్తేందుకు ప్రయత్నించినప్పటికీ.. పక్కనే పడిపోయారు. ఆ దృశ్యాలు భయానకంగా కనిపించాయి. ప్రమాదం జరిగిన తర్వాత చాలాసేపటికి.. సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు హెలికాప్టర్‌లో ఉన్నట్లు మాకు తెలిసింది’’ అని వివరించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని