Published : 09/12/2021 13:43 IST

Divorce: రూ.52 వేల కోట్ల భరణం కావాలి 

కోర్టుకెక్కిన రష్యా బిలియనీర్‌ మాజీ భార్య 

లండన్‌: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.52 వేల కోట్ల భరణం ఇప్పించాలంటూ బ్రిటన్‌లో కోర్టును ఆశ్రయించారు ఓ బిలియనీర్‌ మాజీ భార్య. రష్యాలో అత్యంత సంపన్నుల జాబితాలో వ్లాదిమిర్‌ పొటానిన్‌ది రెండో స్థానం. ఆయన ఆస్తి విలువ సుమారు రూ.2.25 లక్షల కోట్లు. 31 ఏళ్ల కాపురం తర్వాత భార్య నటాలియా పొటానినా నుంచి ఆయన విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలోనే ఆమెకు కొంత భరణం అందించారు. అయితే తనకు భరణం విషయంలో అన్యాయం జరిగిందని, మరింత సొమ్ము ఇప్పించాలని పొటానినా తాజాగా లండన్‌లోని ఓ కోర్టును ఆశ్రయించారు.

ప్రముఖ లోహ తయారీ కంపెనీ ఎంఎంసీ నోరిల్‌స్క్‌ పీజేఎస్‌సీలో వ్లాదిమిర్‌కు ఉన్న వాటాలో 50% తనకు ఇప్పించాలని విన్నవించారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఆమె అడుగుతున్న వాటా విలువ రూ.52.8 వేల కోట్లకు పైమాటేని సమాచారం. దాంతోపాటు రష్యాలో వ్లాదిమిర్‌కు ఉన్న మరికొన్ని ఆస్తులనూ ఆమె కోరుతున్నట్లు తెలుస్తోంది. లండన్‌లోని విడాకుల కోర్టులు గతంలో పలు కేసుల్లో భారీ మొత్తాల్లో భరణాలను ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాయి. ఆస్తుల్లో భార్య-భర్తలకు దాదాపు సమాన వాటా ఉండేలా కూడా తీర్పులిచ్చాయి. ఈ నేపథ్యంలో పొటానినాకు అనుకూలంగా తీర్పు రావడం ఖాయమని తెలుస్తోంది. అదే జరిగితే- అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (రూ.2.7 లక్షల కోట్లు), మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (రూ.1.96 లక్షల కోట్లు) తర్వాత అత్యధిక భరణం ఇవ్వనున్న వ్యక్తిగా వ్లాదిమిర్‌ రికార్డుల్లోకెక్కుతారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని