Helicopter crash: ప్రమాదానికి ముందు హెలికాప్టర్‌ దృశ్యాలు..

సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

Updated : 09 Dec 2021 12:14 IST

కున్నూర్‌: సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం చివరి క్షణంలో హెలికాప్టర్... దట్టమైన పొగమంచులోకి వెళ్లిపోవడం ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది. ఆ తర్వాత హెలికాప్టర్ కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్‌లో రికార్డు చేశారు. ఇప్పుడు ఇవి వైరల్‌ అవుతున్నాయి.

బ్లాక్‌బాక్స్‌ స్వాధీనం..

మరోవైపు హెలికాప్టర్‌ ప్రమాదస్థలిని వాయుసేన అధికారులు ఈ ఉదయం పరిశీలించారు. ఘటనాస్థలి నుంచి బ్లాక్‌బాక్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్‌ కూలిన ప్రదేశానికి 30 అడుగుల దూరంలో దీన్ని గుర్తించారు. ప్రమాద దర్యాప్తులో బ్లాక్‌బాక్స్‌ కీలకం కానుంది. అందులో నమోదైన సంభాషణల ఆధారంగా ప్రమాదానికి కారణాలు తెలుసుకునే వీలుంది. దీన్ని డీకోడ్‌ చేసేందుకు దిల్లీకి తరలించే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని