Helicopter Crash: సాయితేజ మృతదేహం గుర్తింపు

తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరో ఆరుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్‌నాయక్‌ సాయితేజతో పాటు వివేక్‌ కుమార్‌ భౌతికకాయాన్ని కూడా గుర్తించినట్లు

Updated : 11 Dec 2021 10:55 IST

దిల్లీ: తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరో ఆరుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్‌నాయక్‌ సాయితేజ భౌతికకాయాన్ని కూడా గుర్తించినట్లు భారత సైన్యం తెలిపింది. వారి పార్థివదేహాలను ఉదయం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు వెల్లడించింది. మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను సైతం గుర్తించారు. మిగిలిన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని భారత సైన్యం వెల్లడించింది.

సాయితేజతో పాటు జూనియర్‌ వారెంట్‌ ఆఫీసర్‌ ఎ. ప్రదీప్‌, వింగ్‌ కమాండర్‌ పీఎస్‌ చౌహాన్‌, జూనియర్‌ వారెంట్‌ ఆఫీసర్‌ రాణాప్రతాద్‌ దాస్‌, స్క్వాడ్రన్‌ లీడర్‌ కుల్‌దీప్‌ సింగ్‌, లాన్స్‌ నాయక్‌ వివేక్‌ కుమార్‌ మృతదేహాలను గుర్తించిన సైన్యం.. వారి మృతదేహాలను ఉదయం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు