Misfire: గురితప్పిన తూటా.. తల్లి ఒడిలోని బిడ్డ మృతి!

ఏనుగుల గుంపును తరిమేందుకు అటవీ సిబ్బంది జరిపిన కాల్పులకు... అమ్మ ఒడిలో సేదతీరుతున్న రెండేళ్ల చిన్నారి 

Published : 11 Dec 2021 11:02 IST

ఏనుగుల గుంపును అటవీ సిబ్బంది తరుముతుండగా అపశ్రుతి

బోకో: ఏనుగుల గుంపును తరిమేందుకు అటవీ సిబ్బంది జరిపిన కాల్పులకు... అమ్మ ఒడిలో సేదతీరుతున్న రెండేళ్ల చిన్నారి శాశ్వతంగా ఒరిగిపోయింది! అస్సాంలోని కామరూప్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బోకోలోని బోండపారా ప్రాంతానికి ఇటీవల ఏనుగులు గుంపుగా వచ్చాయి. వాటిని తరిమేందుకు అటవీ సిబ్బంది కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఏనుగులను బెదిరించేందుకని గురువారం రాత్రి వారు తుపాకీలతో కాల్పులు జరిపారు. అయితే, ఓ తూటా ప్రమాదవశాత్తూ... అక్కడికి సమీపంలోని ఓ ఇంటి ముందు అమ్మఒడిలో కూర్చున్న బిడ్డ శరీరంలోంచి బలంగా దూసుకెళ్లి, ఆమె తల్లిని కూడా గాయపరిచింది! గార్డులు వెంటనే వారిద్దర్నీ బోకోలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆ చిన్నారి చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన తల్లిని గువాహటి వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు