Tajmahal: భారీగా తగ్గిన తాజ్‌మహల్‌ ఆదాయం

కరోనా కారణంగా తాజ్‌మహల్‌ ఆదాయం 89.43% తగ్గింది. 2019-20లో 

Published : 14 Dec 2021 13:47 IST

 అయిదేళ్లలో రూ.306 కోట్ల రాక

ఈనాడు, దిల్లీ: కరోనా కారణంగా తాజ్‌మహల్‌ ఆదాయం 89.43% తగ్గింది. 2019-20లో ఈ పర్యాటక సౌందర్యాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకుల నుంచి రూ.106 కోట్ల ఆదాయం రాగా 2020-21లో అది రూ.11 కోట్లకు పడిపోయిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. సోమవారం లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ఆగ్రాలో ఉన్న 8 చారిత్రక స్థలాల నుంచి 2019-20లో రూ.153.08 కోట్ల ఆదాయం రాగా, 2020-21లో అది రూ.13.40 కోట్లకు తగ్గిపోయినట్లు చెప్పారు. ఇదే సమయంలో వీటి నిర్వహణ ఖర్చు 2019-20లో రూ.8.09 కోట్లు కాగా, 2020-21లో అది రూ.5.89కోట్లకు పరిమితమైనట్లు చెప్పారు. గత అయిదేళ్లలో తాజ్‌మహల్‌కు రూ.306 కోట్ల ఆదాయం రాగా, నిర్వహణ కోసం రూ.8.87 కోట్లు వ్యయం చేసినట్లు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు