Published : 15 Dec 2021 11:25 IST

Nirav Modi: నీరవ్‌ మోదీ ‘మానసిక ఆరోగ్య’ పిటిషన్‌ను విచారించిన బ్రిటన్‌ న్యాయస్థానం

లండన్‌: మోసం, నగదు అక్రమ చలామణి తదితర అభియోగాలపై తనను భారత్‌కు అప్పగించే అంశాన్ని మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కారణాలను చూపుతూ వ్యతిరేకిస్తూ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ పెట్టుకున్న అభ్యర్థనపై లండన్‌లోని హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును సుమారు 2 బిలియన్‌ డాలర్ల మేర (సుమారు రూ.15,000 కోట్లు) ముంచేసిన కేసులో నీరవ్‌ మోదీ నిందితుడు. ఈ మేరకు రాయల్‌ కోర్ట్స్‌ ఆఫ్‌ జస్టిస్‌లో లార్డ్‌ జస్టిస్‌ జెరెమీ స్టువర్ట్‌ స్మిత్, జస్టిస్‌ రాబర్ట్‌ జే విచారణ చేపట్టారు. నీరవ్‌ మోదీ అప్పగింతను సమర్థిస్తూ జిల్లా జడ్జి శామ్‌ గూజ్స్‌ ఫిబ్రవరి నెలలో జారీచేసిన ఆదేశాల్లో నిందితుడు ‘ఆత్మ హత్య చేసుకునే ముప్పు’ను విస్మరించడం ఒకవేళ సరికాదా? అనేది నిర్ధరించరున్నారు. మరోవైపు, భారత్‌కు అప్పగించిన తర్వాత నీరవ్‌ ఆరోగ్యానికి సంబంధించి తీసుకునే జాగ్రత్తలకు సంబంధించిన అంశాలను న్యాయస్థానం నవంబరు 13న ఆలకించింది. ప్రత్యేక వైద్య సంరక్షణ, అంబులెన్స్‌ తదితర సదుపాయాలను కల్పిస్తామని భారతీయ అధికారులు పునరుద్ఘాటించారు. మరోవైపు, మంగళవారం నాటి విచారణను ముగించిన న్యాయస్థానం భారత అధికారులు గత నెలలో ఇచ్చిన హామీలపై స్పందించేందుకు నీరవ్‌ తరఫు బృందానికి సోమవారం వరకు గడువు ఇచ్చింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని