Philippines: ఫిలిప్పీన్స్‌లో ‘రాయ్‌’ బీభత్సం..75మంది మృతి

ఫిలిప్పీన్స్‌లో రాయ్‌ తుపాను బీభత్సం సృష్టించింది. పెనుగాలులతో విరుచుకుపడి

Updated : 19 Dec 2021 12:36 IST

మనీలా: ఫిలిప్పీన్స్‌లో రాయ్‌ తుపాను బీభత్సం సృష్టించింది. పెనుగాలులతో విరుచుకుపడి దేశం మొత్తాన్ని అంధకారంలోకి నెట్టింది. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు శనివారం దేశవ్యాప్తంగా 75 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌లో తుపాను ప్రభావం అధికంగా ఉంది. తమ రాష్ట్రం పూర్తిగా నేలమట్టమైందని డినాగాట్‌ ఐలాండ్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ బగావు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని