Omicron: బ్రిటన్‌.. ఒక్కరోజులోనే 10వేల ఒమిక్రాన్‌కేసులు

బ్రిటన్‌లో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ హడలెత్తిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా బ్రిటన్‌లో శనివారం రోజువారీ కేసులు నమోదయ్యాయి.

Published : 20 Dec 2021 09:22 IST

7కు పెరిగిన ఒమిక్రాన్‌ మరణాలు

లండన్‌: బ్రిటన్‌లో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ హడలెత్తిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా బ్రిటన్‌లో శనివారం రోజువారీ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు ఒక్కరోజులో 90 వేల మందికి పైగా కొవిడ్‌ బారిన పడగా.. ఇందులో 10 వేలకు పైగా ఒమిక్రాన్‌ కేసులే. కొత్త వేరియంట్‌ కేసులు శుక్రవారం 3,201 నమోదు కాగా.. ఒక్క రోజులోనే 3 రెట్లకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 25 వేలకు చేరువైంది. అక్కడ శనివారం 125 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ మరణాల సంఖ్య 7కి పెరిగింది. 

బ్రిటన్‌లో ఇప్పటికే నిర్దిష్ట కార్యక్రమాలకు కొవిడ్‌ పాసులు, అనేకచోట్ల మాస్కులు తప్పనిసరి చేయడంతో పాటు వీలయినంతమేర ‘ఇంటి నుంచి పని’ని ప్రోత్సహిస్తున్నారు. ఈనెల 27 నుంచి వేల్స్‌లో నైట్‌క్లబ్‌లను మూసివేస్తున్నారు. మరోవైపు బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేశారు. బ్రిటన్‌లో 40 ఏళ్లు దాటినవారిలో మూడొంతుల మందికి బూస్టర్‌ డోస్‌ అందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు