
Jammu kashmir:గడ్డకట్టిన పహల్గావ్.. ఉష్ణోగ్రత ఎంతో తెలుసా?
మైనస్ 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు
శ్రీనగర్, ఈనాడు, జైపుర్: జమ్మూ-కశ్మీర్లో అతి శీతల వాతావరణం కొనసాగుతోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అక్కడి వివిధ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయాయని చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపు ఉండే పహల్గావ్లో ఏకంగా మైనస్ 8.7 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శ్రీనరగ్‌లో ఆదివారమూ మైనస్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ జిల్లాలో మైనస్ 7.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
రాజస్థాన్‌లోని ఫతేపుర్‌లో మైనస్ 4.7 డిగ్రీలు
రాజస్థాన్‌లోని ఫతేపుర్‌లో అత్యల్పంగా మైనస్ 4.7 డిగ్రీల సెల్సియస్, చురులో మైనస్ 2.6 డిగ్రీల సెల్సియస్, సికార్‌లో మైనస్ 2.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ అధికారులు తెలిపారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో మైనస్ 0.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.