డబ్బుల సంగతి చెప్పినా తీసుకోలేకపోయారు..

అమెరికాలోని టెన్నెస్సీ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ కెన్యాన్‌ విల్సన్‌.. 

Updated : 20 Dec 2021 09:55 IST

అమెరికాలో విద్యార్థులకు వినూత్న పరీక్ష పెట్టిన ప్రొఫెసర్‌ 

వాషింగ్టన్‌: అమెరికాలోని టెన్నెస్సీ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ కెన్యాన్‌ విల్సన్‌.. తన విద్యార్థులు సిలబస్‌ను పూర్తిగా చదువుతున్నారో? లేదో? తెలుసుకోవాలని భావించారు. ఇందుకు విభిన్నమైన పరీక్ష పెట్టారు. ఓ సంగీత సదస్సు కోసం 3 పేజీల సిలబస్‌ను విద్యార్థులకు ఇచ్చి పూర్తిగా చదవమన్నారు. తరగతిలోని 70 మంది పేర్లు నమోదు చేసుకోగా, ఏ ఒక్కరూ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఎందుకంటే.. ఆ సిలబస్‌లోని రెండో పేజీలో ఓ లాకర్‌కు సంబంధించిన చోటు, దాని కాంబినేషన్‌ సంకేతాలు (క్లూలు) ఉంచారు. ఆ లాకర్‌లో 50 డాలర్లు (రూ.3,800) ఉండటం విశేషం. విద్యార్థులు ఎవరూ ఆ సంగతిని కనిపెట్టలేకపోయారు. ‘‘క్లెయిమ్‌ చేసిన మొదటి వ్యక్తికి ఉచితం; లాకర్‌ నెంబర్‌ 147; కాంబినేషన్‌ 15,25,35’’ అని రెండో పేజీలో ఉంది. డిసెంబర్‌ 8తో సెమిస్టర్‌ ముగిసింది. విద్యార్థులు ఇళ్లకు వెళ్లారు. అయినా నగదు మొత్తం ఆ లాకర్‌లోనే ఉంది. ఈ విషయాన్నంతా కెన్యాన్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడం విశేషం. ఈ పోస్ట్‌ గురించి ఏకంగా కెనడియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌.. ఆయన్ను సంప్రదించింది. ఆ తర్వాత అది మరింత వైరల్‌ అయింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని