CBI: అధికారాల పెంపుపై మీరేమంటారు?

సీబీఐ అధికార పరిధిని స్పష్టంగా నిర్వచించడంతో పాటు దానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టే అంశంపై

Updated : 20 Dec 2021 10:02 IST

సీబీఐ అభిప్రాయం కోరిన పార్లమెంటరీ స్థాయీసంఘం 

దిల్లీ: సీబీఐ అధికార పరిధిని స్పష్టంగా నిర్వచించడంతో పాటు దానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టే అంశంపై పార్లమెంటరీ స్థాయీసంఘం ఒకటి కసరత్తులు చేస్తోంది! ఈ అంశంపై అభిప్రాయం తెలియజేయాల్సిందిగా సీబీఐని అది కోరింది. ప్రస్తుతం సంస్థలో వెయ్యికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో.. వాటిని భర్తీ చేసేందుకు నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాలని సూచించింది. రాష్ట్రాలు తమకు సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవడం దర్యాప్తు ప్రక్రియలకు ప్రతిబంధకంగా మారుతోందంటూ సీబీఐ ఇంతకుముందు ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వాదనతో తాము ఏకీభవిస్తున్నట్లు- భాజపా నేత సుశీల్‌ కుమార్‌ మోదీ నేతృత్వంలోని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, న్యాయ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీసంఘం గత నివేదికలో తెలిపింది. అందుకే సీబీఐ అధికారాల పరిధిని స్పష్టంగా నిర్వచించడంతో పాటు దానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టే దిశగా ప్రస్తుత చట్టాలను సవరించే అవకాశాన్ని లేదా కొత్త చట్టాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనిపై సీబీఐ నుంచి ఇంకా స్పందన లేకపోవడంపై స్థాయీసంఘం ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే అభిప్రాయాలు తెలియజేయాలని ఆ సంస్థను కోరింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని