Philippines: ఫిలిప్పీన్స్‌లో 375కు పెరిగిన ‘రాయ్‌’ మరణాలు

ఫిలిప్పీన్స్‌లో రాయ్‌ తుపాను సృష్టించిన విధ్వంసం దృశ్యాలు క్రమక్రమంగా బయటకొస్తున్నాయి. 

Updated : 24 Nov 2022 14:07 IST

మనీలా: ఫిలిప్పీన్స్‌లో రాయ్‌ తుపాను సృష్టించిన విధ్వంసం దృశ్యాలు క్రమక్రమంగా బయటకొస్తున్నాయి. ఈ ప్రచండ తుపాను ధాటికి మొత్తం 375 మంది మరణించారని, 56 మంది గల్లంతయ్యారని అధికారులు సోమవారం తెలిపారు. ఇప్పటికీ చాలా ప్రావిన్స్‌లలో సమాచార, విద్యుత్తు వ్యవస్థల పునరుద్ధరణ జరగలేదు. ఆహారం, మంచినీటి కోసం ఆర్తనాదాలు ఆగలేదు. చాలా గ్రామాలు, పట్టణాల్లో సమాచార వ్యవస్థ అందుబాటులోకి రాలేదని, అందువల్ల మరణించినవారి సంఖ్య పెరిగే అవకాశముందని జాతీయ పోలీసు విభాగం ప్రకటించింది. అదే సమయంలో ప్రభుత్వ విభాగాలు మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నట్లు వెల్లడించింది. చెట్లు కూలడం, మెరుపు వరదలు, కొండచరియలు విరిగి పడడం వంటి కారణాల వల్లే ఎక్కువ మరణాలు సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని