Omicron:ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు పనిచేయవనే ఆధారాల్లేవు

కరోనాపై పోరుకు ప్రస్తుతం వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లు.. ఒమిక్రాన్‌ రకంపై పనిచేయవని చెప్పే ఆధారాలేవీ లేవని కేంద్రం స్పష్టం..

Published : 22 Dec 2021 10:46 IST

పార్లమెంటులో కేంద్రం స్పష్టీకరణ

దిల్లీ: కరోనాపై పోరుకు ప్రస్తుతం వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లు.. ఒమిక్రాన్‌ రకంపై పనిచేయవని చెప్పే ఆధారాలేవీ లేవని కేంద్రం స్పష్టం చేసింది. వైరస్‌ కొమ్ము జన్యువు (స్పైక్‌ జీన్‌)లో కొన్ని ఉత్పరివర్తనలు ప్రస్తుత వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని తగ్గిస్తాయనే ప్రచారం జరుగుతున్నా దీనిపై నిపుణుల అభిప్రాయాలతో పూర్తి సమాచారం అందుబాటులో లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ రాజ్యసభకు తెలిపారు. దేశంలో ఇస్తున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌పై పనిచేస్తాయా అనే ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘యాంటీబాడీలు, కణాల్లోని జ్ఞాపకశక్తి ఆధారంగా కూడా వ్యాక్సిన్ల రక్షణ లభిస్తుంది. తీవ్ర వ్యాధి బారిన పడకుండా వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తాయి. అందుబాటులో ఉన్నవాటితో టీకాలు ఇవ్వడం కీలకం’ అని చెప్పారు.

‘దేశ వ్యతిరేకి’ నిర్వచనం మొదట్లో చట్టాల్లో లేదు
దేశ వ్యతిరేకి (యాంటీ నేషనల్‌) అనే పదానికి నిర్వచనం చట్టాల్లో లేదనీ, 1976లో అత్యయిక పరిస్థితి సమయంలో మొదటిసారిగా దీనిని రాజ్యాంగంలో చేర్చి, తర్వాత ఒక ఏడాదిలో తొలగించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లోక్‌సభలో తెలిపారు. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రతలకు హాని కలిగించే కార్యకలాపాలకు పాల్పడినవారి విషయంలో ఎలా వ్యవహరించాలో నేరన్యాయ చట్టాలు, న్యాయ సమీక్ష ఆదేశాల్లో ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని