Pfizer Covid Pill:కొవిడ్‌కు ఫైజర్‌ కొత్త మాత్ర..తొలిసారిగా అమెరికా ఆమోదం

కొవిడ్‌ బాధితులకు ఊరటనిచ్చేలా అమెరికా తొలిసారి ఓ మాత్రను అందుబాటులోకి తెచ్చింది. ఇంటివద్దే చికిత్స పొందుతూ తీసుకొనేలా ..

Updated : 23 Dec 2021 12:01 IST

వాషింగ్టన్‌: కొవిడ్‌ బాధితులకు ఊరటనిచ్చేలా అమెరికా తొలిసారి ఓ మాత్రను అందుబాటులోకి తెచ్చింది. ఇంటివద్దే చికిత్స పొందుతూ తీసుకొనేలా ఈ ఔషధానికి బుధవారం అనుమతి ఇచ్చింది. ఈమేరకు ఫైజర్‌ రూపొందించిన ‘పాక్స్‌లోవిడ్‌’ పిల్‌ను చికిత్సకు వినియోగించవచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు. చౌకగా లభించే ఈ మాత్ర కొవిడ్‌ ప్రారంభదశలో వేగవంతమైన చికిత్స అందించడానికి పనిచేస్తుందని తెలిపారు. ప్రారంభంలో ఈ ఔషధం సరఫరా చాలా పరిమితమేనని చెబుతున్నారు. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన వారికి.. ఆసుపత్రిపాలయ్యే ముప్పు ఎక్కువగా ఉన్నవారికి ప్రారంభదశలోనూ ఈ మాత్రను వినియోగించవచ్చని అధికారులు తెలిపారు. ఈమేరకు ఫైజర్‌ మాత్రను వయోజనులకు, 12 ఏళ్లు.. ఆ పైబడిన పిల్లలకు వినియోగించేందుకు అమెరికాలోని ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని