Published : 23 Dec 2021 10:46 IST

రాజకీయ నాయకుల్లో శాసన నిగ్రహాన్ని పెంపొందించాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

చట్టసభ్యుల పని శాసనాలు చేయడమే.. అడ్డుకోవడం కాదని వ్యాఖ్య

దిల్లీ: రాజకీయ నేతల్లో శాసన నిగ్రహాన్ని పెంపొందించాల్సిన అవసరముందని... చట్టసభ్యుల ప్రధాన లక్ష్యం చట్టాలు చేయడం, చర్చించడం, వాదనలు వినిపించడమే తప్ప, వాటికి అడ్డుపడటం కాదని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రాథమిక శాస్త్రీయ భావనలను వారికి మాతృభాషల్లో వివరించాలన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ఆధ్వర్యంలోని ‘విజ్ఞాన్‌ ప్రసార్‌’ సంస్థ ఏర్పాటుచేసిన స్ఫూర్తిదాయక శాస్త్రవేత్తల శతాబ్ది జయంతి ఉత్సవాలను వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ- ‘‘ఓవైపు మనం పురోగతి సాధిస్తున్నాం. మరోవైపు కొందరు వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. దీన్ని త్వరగా సరిదిద్దాలి. మన రాజకీయ నాయకులకు శాస్త్రీయ దృక్పథంతో పాటు శాసన నిగ్రహం కూడా అవసరమని భావిస్తున్నాను. ఎగువసభ అధ్యక్షునిగా అక్కడ ఏం జరుగుతోందన్నది నేను చూస్తున్నాను.

స్టెమ్‌ రంగాల్లో మహిళలను ప్రోత్సహించాలి...
అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో కంటే మెరుగ్గా, స్టెమ్‌ రంగాల్లో మన మహిళా గ్రాడ్యుయేట్లు 42% మంది ఉన్నారు. కానీ, పరిశోధన-అభివృద్ధికి వచ్చేసరికి వీరిలో కేవలం 16.6% మందే కొనసాగుతున్నారు. బాలికలు గణితం, సైన్స్‌ రంగాలను ఎంపిక చేసుకునేలా ప్రోత్సాహకర వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరముంది. ఉపాధి రంగంలోనూ లింగ వివక్షతను రూపుమాపాలి. ప్రాథమిక శాస్త్రీయ భావనలను ప్రజలకు అర్థమయ్యేలా వారి మాతృభాషల్లో వివరించాలి. ఈ దిశగా వీలైనన్ని ఎక్కువ భారతీయ భాషల్లో పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు, డాక్యుమెంటరీలు, రేడియో కార్యక్రమాలను రూపొందించాలి’’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు కె.విజయ రాఘవన్‌ మాట్లాడుతూ- ప్రతి విద్యార్థి సొంతంగా ఆలోచించి, అవకాశాలను అందుకునేలా ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని ప్రశంసించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని