
Published : 23 Dec 2021 11:06 IST
Booster Dose: బూస్టర్ డోసులకు తొందరపడొద్దు: డబ్ల్యూహెచ్వో
బెర్లిన్: కొవిడ్-19 అంతానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాన్ని బూస్టర్ డోసుల కోసం ధనిక దేశాలు చూపుతున్న ఆత్రుత మరింత ప్రమాదంలోకి నెట్టివేస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. ‘ఏకపక్షంగా వెళ్లి ఏ దేశం కూడా ఈ మహమ్మారిని జయించలేదు’ అని స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోం గేబ్రియేసెస్ బుధవారం ఆన్లైన్ న్యూస్ కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. బూస్టర్ డోసులు తీసుకోని ఎవరూ ఆసుపత్రిపాలు కావడం లేదని, వ్యాక్సిన్ తీసుకోని వారికే ఈ ముప్పు ఎక్కువగా ఉందన్నారు.
Tags :