Maharashtra:శక్తి బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదం..

మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేలా మహారాష్ట్ర అసెంబ్లీ గురువారం కీలక బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది.

Published : 24 Dec 2021 10:34 IST

మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు

ముంబయి: మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేలా మహారాష్ట్ర అసెంబ్లీ గురువారం కీలక బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. కొన్ని కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించేందుకూ అది వీలు కల్పించనుంది. ‘శక్తి క్రిమినల్‌ చట్టాల (మహారాష్ట్ర సవరణ) బిల్లు’గా దాన్ని పిలుస్తున్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణ శరవేగంగా పూర్తయ్యేందుకు ఇది దోహదపడుతుంది. త్వరలోనే దానికి శాసనమండలి ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని దిశ చట్టం తరహాలో ఈ బిల్లును రూపొందించారు. తాజా బిల్లులోని నిబంధనల ప్రకారం.. మహిళలు, చిన్నారులపై కొన్నిరకాల నేరాలకు పాల్పడేవారికి ఏకంగా మరణశిక్ష విధించొచ్చు. ఈ కేసుల్లో దర్యాప్తు.. ఫిర్యాదు అందిన 30 రోజుల్లోపు పూర్తవ్వాలి. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా అధికారులు కోరే డేటాను సామాజిక మాధ్యమాలు, అంతర్జాల సర్వీసు ప్రొవైడర్లు 7 రోజుల్లోపు తప్పనిసరిగా అందించాలని తాజా బిల్లు స్పష్టం చేస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని