
Published : 24 Dec 2021 10:58 IST
Supreme Court:ఛార్లెస్ శోభరాజ్ విడుదలపై సమాధానం ఇవ్వండి
కాఠ్‌మాండూ: కరుడుగట్టిన హంతకుడు ఛార్లెస్ శోభరాజ్ 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించినందున ఆయనను ఎందుకు విడుదల చేయకూడదో సమాధానం ఇవ్వాలని నేపాల్ సుప్రీంకోర్టు అక్కడి ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. 77 ఏళ్లు నిండి వృద్ధుడయిన కారణంగా విడుదల చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు వినతులు సమర్పించారు. 1975లో అమెరికాకు చెందిన యువకుడు, అతని ప్రేయసిని హత్య చేసినందుకు కోర్టు 21 ఏళ్ల శిక్ష విధించింది. కెనడా వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇంకా శిక్ష వెలువరించాల్సి ఉంది.
Tags :