Kerala: కేరళ హింస కేసులో 163 మంది కార్మికులు అరెస్టు

క్రిస్మస్‌ రోజు అర్ధరాత్రి ఎర్నాకుళం జిల్లాలోని కిజక్కంబలం

Published : 28 Dec 2021 10:45 IST


కొచ్చి: క్రిస్మస్‌ రోజు అర్ధరాత్రి ఎర్నాకుళం జిల్లాలోని కిజక్కంబలం ప్రాంతంలో చెలరేగిన హింసకు సంబంధించి 163 మంది వలస కార్మికుల్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులను కొట్టడం, వారి వాహనాలను ధ్వంసం చేయడంపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. న్యాయస్థానం వీరిలో 76 మందికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. విందులో మొదలైన వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు వచ్చిన పోలీసులపై కార్మికులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తమ సంస్థ కార్మికులు ఇంతమందిని అరెస్టు చేయడాన్ని కైటెక్స్‌ కంపెనీ ఎండీ సాబు జాకబ్‌ తప్పుపట్టారు. తనను, తన వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకునే అరెస్టులకు పాల్పడ్డారనీ, కార్మికులు తప్పు చేశారని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తనపట్ల వ్యక్తిగత శత్రుత్వంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తనను లక్ష్యంగా చేసుకుని పేద కార్మికుల్ని ఇబ్బంది పెట్టడం తగదని, కంపెనీ మూసివేతనే ప్రభుత్వం కోరుకుంటే అలాగే చేస్తానని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు