Omicron:ఉవ్వెత్తున ఎగసి.. క్షీణించనున్న ఒమిక్రాన్‌!

 భారత్‌లో రోజువారీ ఒమిక్రాన్‌ కేసులు ఒక్కపెట్టున పెరిగి, 

Updated : 30 Dec 2021 09:25 IST

లండన్‌: భారత్‌లో రోజువారీ ఒమిక్రాన్‌ కేసులు ఒక్కపెట్టున పెరిగి, కొద్దిరోజుల తరవాత బాగా తగ్గిపోతాయని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ ఆచార్యుడు పాల్‌ కాటుమన్‌ అంచనా వేశారు. విశ్వవిద్యాలయం తరఫున కొవిడ్‌ ఇండియా ట్రాకర్‌ను రూపొందించిన పరిశోధకుల్లో ఆయన ఒకరు. మరికొద్ది రోజుల్లో.. బహుశా ఈ వారంలోనే భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు వేగంగా పెరిగిపోవచ్చునని పాల్‌ పేర్కొన్నారు. పెరుగుదల ఎంతమేరకు ఉంటుందన్నది మాత్రం ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. భారత్‌లో రెండో దశ కొవిడ్‌ మే నెలలో విరుచుకుపడుతుందని కొవిడ్‌ ఇండియా ట్రాకర్‌ గతంలో కచ్చితత్వంతో అంచనా వేసిన సంగతి గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని