Ashraf ghani: అందుకే దేశం విడిచి పారిపోయా: అష్రాఫ్‌ గని

అఫ్గానిస్థాన్‌ నుంచి పారిపోవడం మినహా వేరే ప్రత్యామ్నాయం లేదని..

Updated : 31 Dec 2021 12:16 IST

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌ నుంచి పారిపోవడం మినహా వేరే ప్రత్యామ్నాయం లేదని.. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సివచ్చిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ గని తెలిపారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వూలో తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించిన ఆగస్టు 15న జరిగిన ఘటనలను వివరించారు.

‘‘కాబుల్‌ నగరాన్ని రెండు వైపుల నుంచి తాలిబన్లకు చెందిన రెండు వర్గాలు ముట్టడించాయి. ఆ సమయంలో ఆ రెండింటి మధ్య ఘర్షణ చెలరేగితే కాబుల్‌ నాశనం అవుతుంది. నిజానికి ఆ రోజు ఉదయం వరకు దేశం విడిచివెళ్లాలన్న ఆలోచనే లేదు. మధ్యాహ్నానికి పరిస్థితులు మారాయి, నన్ను రక్షించలేమని భద్రతా సిబ్బంది చెప్పారు. విమానం ఎక్కడానికి రెండు నిమిషాల సమయం కూడా వారు నాకు ఇవ్వలేదు’’ అని గని పేర్కొన్నారు. కాబుల్‌ను విడిచే సమయంలో తాను భారీస్థాయిలో డబ్బులు తీసుకువెళ్లానన్న ఆరోపణల్లో నిజం లేదని గని తెలిపారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని