Uttar Pradesh: ఈ ఏడేళ్ల చిన్నారి.. అమ్మకే అమ్మ

ఆమె ఏడేళ్ల చిన్నారి.. తన బాగోగులు తానే చూసుకోలేని వయసులో అనారోగ్యంతో ఉన్న తల్లికి సపర్యలు చేస్తోంది.

Updated : 03 Jan 2022 10:06 IST

ఆమె ఏడేళ్ల చిన్నారి.. తన బాగోగులు తానే చూసుకోలేని వయసులో అనారోగ్యంతో ఉన్న తల్లికి సపర్యలు చేస్తోంది. తమ్ముడినీ చూసుకుంటోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన కేలాదేవి గత కొన్నిరోజులుగా వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడుతోంది. తరచూ అనారోగ్యానికి గురవుతోందని ఈమెను భర్త కుటుంబం వదిలేసింది. ఇళ్లలో పని చేస్తూ తన ఇద్దరు పిల్లలను పోషించుకునేది. ఇటీవల ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో ఆగ్రాలోని జిల్లా ఆస్పత్రిలో చేరింది. వెన్నెముకకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. ఆర్థికస్తోమత లేక.. అదే ఆస్పత్రిలో కొద్దిరోజులుగా ఉంటోంది. ఏడేళ్ల కుమార్తె ప్రీతా ప్రజాపతి.. అన్నీ తానై కేలాదేవికి సేవలు చేస్తోంది. అన్నం తినిపించడం మెదలుకొని.. ఇతర అవసరాలన్నీ తీరుస్తోంది. ఒకటో తరగతి చదివే తమ్ముడు సత్యం కుమార్‌ బాగోగులూ చూస్తూ.. తను పాఠశాలకు వెళ్తోంది. ఖాళీ దొరికితే హోంవర్క్‌ చేస్తోంది. ప్రీతా ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. భవిష్యత్తులో వైద్యురాలినై తల్లికి మెరుగైన చికిత్స అందిస్తానని అంటోంది. ఎన్ని కష్టాలు ఎదురైనా.. తన పిల్లలను బాగా చదివించడమే  లక్ష్యమని కేలాదేవి చెబుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని