
టికెట్ లేని ప్రయాణికుడిని కాలితో తన్నిన పోలీసు..
మావేలీ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన: సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు
తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురం వెళుతున్న మావేలీ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం చోటుచేసుకుంది. స్లీపర్ క్లాస్ బోగీలో తలుపు వద్ద నేలపై కూర్చున్న టికెట్ లేని ప్రయాణికుడిని ఏఎస్‌ఐ ఎంపీ ప్రమోద్ కాలితో పదేపదే తన్నారు. అనంతరం వడకరా స్టేషన్‌లో ప్రయాణికుడిని రైలు నుంచి గెంటేశారు. అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు ఆ తతంగాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఆ దశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసు ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రమోద్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేయడంతోపాటు, నివేదిక సమర్పించాలని కన్నూరు పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.